WPL Auction : బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మంధానకు రూ.3.40 కోట్ల భారీ ధర దక్కడంతో సోషల్‌మీడియాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాంను తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే..? టీ20 లీగ్ వేలంలో బాబర్ కంటే మంధాన అత్యధిక ధర పలికింది. అతడి కంటే రెండింతలు ఎక్కువ ధరకు ఆర్సీబీ ఆమెను కొనుగోలు చేసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాబర్ కేవలం రూ.2.30 కోట్లకు అమ్ముడుపోయాడు. ఆ లీగ్‌లో అతనే ఖరీదైన ప్లేయర్ కావడం విశేషం. ‘నీ కంటే మహిళా క్రికెటర్లు ఎక్కువ ధర పలికారు’ అంటూ బాబర్ మీద ఆన్లైన్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
టీ20 లీగ్ వేలంలో పాక్ కెప్టెన్ కంటే టీమిండియా మహిళా క్రికెటర్లకు ముట్టిన ధర చాలా ఎక్కువ. నిన్న ముంబైలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలంలో రూ.50 లక్షల కనీస ధర ఉన్న మంధాను రూ.3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అంతేకాదు దీప్తి శర్మ (రూ.2.60కోట్లు), జెమీమా రోడ్రిగ్స్ (రూ.2.20 కోట్లు), షఫాలీ వర్మ (రూ.2 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్(రూ.1.8 కోట్లు) వంటి భారత క్రికెటర్లు కూడా డబ్ల్యూపీఎల్ వేలంలో ఎక్కువ ధర పలికారు. దాంతో, సోషల్మీడియాలోపాక్ కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
భారత్, పాక్ క్రికెటర్ల జీతాలను పోల్చుతూ సోషల్‌మీడియాలో పోస్టులు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్ వేలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ వంటి ప్లేయర్లు అత్యధిక ధర పలికినప్పుడు కూడా పాక్ క్రికెటర్లను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు పాకిస్థాన్ జట్టు మొత్తానికి పీసీబీ రూ.7.60 కోట్లు చెల్లిస్తోంది. కానీ, ఏ ప్లస్ ఆటగాళ్లు అయిన కోహ్లీ, బుమ్రా, రోహిత్‌లకు బీసీసీఐ రూ. 7 కోట్లు ముట్టజెప్పుతోంది.
Babar Azam Price in PSL – 2.30 CR
SMRITI MANDHANA – 3.4 CrAnd they Compare PSL with IPL #WPLAuction #WPL2023 pic.twitter.com/GBWpeovL9n
— Verot Choli (@VerotCholi) February 13, 2023