న్యూఢిల్లీ, మే 9 : దేశీయ ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ బాటపట్టాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేయోచనలో ఉన్నాయి. దీంట్లోభాగంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించాయి. ఛండీగఢ్, గురుగ్రామ్, నోయిడాలో ఉన్న కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది.
ప్రభుత్వ సలహాదారులు, భద్రత పరిస్థితుల ఆధారంగా వర్క్‌ఫ్రం హోమ్ ను పొడిగించేదానిపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌తోపాటు సరిహద్దు రాష్ర్టాలపై పాక్ క్షిపణిలతో దాడులు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేసిన సంస్థ..తమ ఉద్యోగులకు ఎలాంటి హానీ జరగకుండా ఉండేందుకు వర్క్‌ఫ్రంహోమ్ అవకాశాన్ని కల్పించింది.