Kodangal | వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి కటకట మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మంచి నీటి కరువు ఏర్పడింది. కొడంగల్ నియోజకవర్గంలోని టేకుల్ కోడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారని తెలిపారు. మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నరని తెలిపారు. వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారు.. కనీసం తాగు నీటి కొరత అయినా లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి @revanth_anumula గారు..
మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నరు.మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నరు.
వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుంది.
సంక్షేమ… pic.twitter.com/vArxTfiuOQ
— Harish Rao Thanneeru (@BRSHarish) February 13, 2025