ఓమన్: మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన మన అమ్మాయిలు.. రెండో మ్యాచ్‌లో 5-0తో మలేషియాకు ఓటమి రుచి చూపించారు. పూల్-ఏలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలి అర్థభాగంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన భారత్.. సెకండాఫ్‌లో పుంజుకుంది. స్టార్ స్ట్రైకర్ దీపిక కుమారి హ్యాట్రిక్ గోల్స్ చేయగా కనిక, వైష్ణవి తలా ఓ గోల్ చేశారు.