Kasturipalli : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి (Kasturipalli)లో నీటి కుంటలో పడి ముగ్గురు మరణించారు. స్థానికంగా ఉన్న నీటి కుంటలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోయారు. ఆ పిల్లలను కాపాడే క్రమంలో నీటి ఉద్ధృతికి మహిళ కూడా ప్రాణాలు విడిచింది.
ఈ దుర్ఘటనలో మరణించిన వారిని బీహార్‌కు చెందిన ఉమాదేవి మాంజి(32), కిరాని కుమార్(13), బిరాన్ మాంజీ(6)గా గుర్తించారు. 5 నెలల క్రితం వీరి కుటుంబాలు బతుకుదెరువు కోసం బిహార్ నుంచి సిద్ధిపేటకు వలస వచ్చాయి. ఈ ముగ్గురి మృతితో వారి రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.