మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ ( MP DK Aruna ) మండిపడ్డారు. దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని సవాల్ విసిరారు. నారాయణపేటలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలకు ( Congress Promises ) దిక్కులేక కేంద్రం నిధుల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ( Panchayat Election ) నిర్వహిస్తోందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే సర్పంచుల పదవీకాలం పూర్తికాగానే ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేతకానితనం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3 వేల కోట్లు పంచాయతీల నిధులు ఆగిపోయాయని వెల్లడించారు. ఆ నిధుల కోసమే కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తోందిని అన్నారు.
గందరగోళంగా.. రిజర్వేషన్లు
ఎన్నికల కోసం కాంగ్రెస్ తీరు చూస్తే నవ్వొస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు, 2024 సర్వే ప్రకారం వార్డ్ మెంబెర్స్ రిజర్వేషన్లు నిర్వహించడం విచారకరమని పేర్కొన్నారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని అన్నారు . పార్టీ గుర్తులపై సర్పంచులు గెలవరు. అలాంటప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఏ రకంగానైనా సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలంటూ తాయిలాలు ప్రకటిస్తుందని విరుచుకు పడ్డారు. దసరాకు ఇవ్వాల్సిన చీరలు ఇప్పుడెందుకు ఇస్తున్నన్నారని ప్రశ్నించారు. పిల్లలకు ఫీజు రియింబర్స్‌మెంట్ కావాలా..? కాంగ్రెసొళ్ళు ఇచ్చే ముతక చీరలు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కొడంగల్‌కు రోడ్లు వేసుకుంటే హైదరాబాద్ , సికింద్రాబాద్‌లా మారిపోయినట్లేనా ? నని నిలదీశారు. జిల్లా వాసికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా ఇక్కడి ప్రజలకు ఒరిగింది ఏమిలేదని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.