హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తమకు అండగా ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి రాష్ట్ర మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్లు వినతి పత్రం అందచేశారు. డిజిటల్ క్రాప్ సర్వేలోని సమస్యల గురించి కమిషన్ దృష్టికి తెచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడు మ ద్దూరి విజయ్‌ని బుధవారం ఉదయం 10.30 నుంచి 1.30 గంటల మధ్య ఆయన న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. తనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని విజయ్ మంగళవారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయడంతో జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.