KORUTLA | కోరుట్ల, మే 2: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కుంచ సునీల్ గౌడ్ అన్నారు. పట్టణంలోని కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అసోసియోషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బైరి విజయ్ కుమార్‌తోపాటు నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల రక్షణ కోసం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం కోసం కృషి చేస్తానని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి బార్ కౌన్సిల్ అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆయన వివరించారు.
అనంతరం బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడికి అసోసియేషన్ తరుపున జ్ఞాపికను, బీఆర్ అంబెద్కర్ చిత్ర పటాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కస్తూరి రమేష్, జాయింట్ సెక్రటరీ చిలివేరి రాజశేఖర్, కోశాధికారి చింతకింది ప్రేమ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ గోనే సదానంద్ నేత, లేడీ రిప్రజెంటేటీవ్ అంబల్ల నాగ నిర్మల, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీలు ఫసియుద్దిన్, సుతారి నవీన్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ రాసభక్తుల రాజశేఖర్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.