wildwaters: హైదరాబాద్ జంట నగరాల వాసులు సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకొనేందుకు కొత్త వేదిక సిద్ధమైంది. హైదరాబాద్ లోని అతిపెద్దవాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన వైల్డ్
వాటర్స్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యేక డిస్కౌంట్ తో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.1,590 ఉండే టిక్కెట్ ధర ఈ వారంపాటు రూ.1050కి తగ్గించింది.
టిక్కెట్ ధర తగ్గినప్పటికీ.. అదే ఎంజాయ్మెంట్, ఎంటర్ టైన్మెంట్ పొందొచ్చు. ఈ ప్యాకేజీలో 50కిపైగా అన్ లిమిటెడ్ యాక్సెస్ వాటర్ రైడ్స్, వేవ్ పూల్స్, థ్రిల్ రైడ్స్, లైవ్ డీజే, హార్ట్-రేసింగ్ వాటర్ స్లైడ్స్ వంటి సదుపాయాలున్నాయి. అలాగే సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్. అందుకే ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు. రోజంతా లైవ్ డీజే, మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. పిల్లల ఆనందం కోసం ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. దీంతో పిల్లలు, పెద్దలు కలిసి కుటుంబమంతా ఇక్కడ హాయిగా సేదతీరొచ్చు. ఇక ఇందులోని ఫుడ్ కోర్టుల్లో ఉండే దేశీయ, విదేశీ వంటకాలతో అదిరే రుచుల్ని ఆస్వాదించవచ్చు.
పార్క్ అంతా పండుగ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో ఇక్కడ సంక్రాంతి వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ముందుగానే ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం www.wildwaters.in ను సందర్శించండి.