న్యూఢిల్లీ : సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి పోలీసులు సివిల్ వివాదాల్లో సైతం క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువెత్తుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. ‘సివిల్ కేసులకు క్రిమినల్ కేసులు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.