Ration Cards | మేడ్చల్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 1.44 లక్షల దరఖాస్తులు వస్తే 118 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్‌కార్డులు అందజేసిన విషయం తెలిసిందే. ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ ఎప్పుడు రేషన్ కార్డులు అందిస్తారని ఎదురు చూపులు చూస్తున్నారు. కాగా, మార్పులు-చేర్పులలో భాగంగా 10,500 వందల రేషన్ కార్డులలో మార్పులు-చేర్పులు చేసి కార్డులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే మిగతా వారికి రేషన్ కార్డులు ఎప్పుడు అందుతాయని ఎదురుచూస్తున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని అధికారులు వెల్లడిస్తున్నారు. సర్వే పూర్తయితే లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు జరగుతుందన్న సందేహాలను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు.