బీజేపీ నేతలపై మంత్రి కొండాసురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. బీజేపీవాళ్లు ఏమైనా మీటింగులు పెట్టుడు. జైశ్రీరామ్ అనుడు. జైశ్రీరామ్ అంటే పై నుంచి ఏమైనా పైసలు పడుతున్నయా.. లేకపోతే మనకేమన్నా పథకాలొస్తున్నాయా..? ఇంకేమైనా వస్తున్నయా అంటే ఏమీ లేదని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. ఓ ఈవెంట్కు హాజరైన మంత్రి కొండాసురేఖ మాట్లాడుతరు.
తీసుకొస్తరు మోదీతో మీటింగ్ పెట్టిస్తరు. నాలుగు మాటలు హిందీలో మాట్లాడిస్తరు. వెళ్లగొడ్తరు. ఇక్కడున్నట్వంటి ఇద్దరు మంత్రులు చప్పుడు చేయరు. ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారని చెప్పుకొచ్చారు.
జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా?
బీజేపీ వాళ్లు మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప చేసేది ఏం ఉండదు
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడి బీజేపీ నాయకులు మూసుకొని కూర్చుంటున్నారు
– మంత్రి కొండా సురేఖ pic.twitter.com/OskcyVDmmL
— Telugu Scribe (@TeluguScribe) May 5, 2026