Paddy Procurement | నమస్తే నెట్వర్క్, నవంబర్ 1 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం, నిర్మల్ మండలం వెంగ్వాపేట్, డ్యాంగాపూర్, చిట్యాల్, ముజ్గి, రత్నాపూర్‌కాండ్లీ, నీలాయిపేట్, మేడిపెల్లి గ్రామాల్లో పంటలు నేలకొరగడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో పటాకుల దుకాణాలు, ఆర్డీవో కార్యాలయంలోకి వరద చేరింది. లోకేశ్వరం మండలం పొట్పెల్లి (బీ)లో బాండోల్ల రమేశ్ బొప్పాజీకి చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఆరబెట్టిన సోయాబీన్ తడిసింది.
మంచిర్యాల భీమిని మండలం వడాలలో విఠల్‌కు చెందిన ఎకరం వరి నేలకొరిగింది. దండేపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన గడ్డం నాగమ్మ(31) పిడుగుపడి మృతిచెందింది. కాసిపేట మండలం మలేపల్లి, దేవాపూర్, పెద్దనపల్లిలో వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాండూర్ మండలం గోపాల్‌నగర్‌లో రైతు శ్రీనివాస్‌కు చెందిన 5 ఎకరాల వరి నేలకొరిగింది. నెన్నెల మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవ్వగా, పలుచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్ల్లో ఆరుగాలం పడ్డ కష్టమంతా నీళ్లపాలైందని అన్నదాతలు ఆందోళన చెందారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,008 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించగా ఇరవై శాతం ప్రారంభమయ్యాయి. మెదక్, దుబ్బాక, సిద్దిపేట మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండ లం సిద్దన్నపేట మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటినా ఇంతవరకు కొనలేదని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నా రు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం, కొయ్యగుట్ట, జక్కల్దానితండా, బోర్లం క్యాంపు, లింగంపేట మండలం భవానీపేట, జల్దిపల్లి, ముంబాజీపేట, రాంపూర్, శెట్పల్లి, పర్మళ్ల, మెంగారం, బోనాల్, బాయంపల్లితోపాటు నాగిరెడ్డిపేట, లింగంపేట, రుద్రూర్, మహ్మద్‌నగర్ మండలంలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానాతంటాలు పడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్ర శివారులోని కొనుగోలు కేంద్రంలోధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. రెడ్డికాలనీలో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏటూరునాగారం, నవంబర్ 1: పంట దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జి ల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు చెన్నూరి మల్లయ్య(55) ఎనిమిదెకరాల్లో వ్యవసాయం చేయగా, ఇందులో ఐదు ఎకరాల్లో మిర్చి, మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. నాలుగేండ్లుగా పంట దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టం వ చ్చింది. నిరుడు కూ డా మిర్చికి ధర లేకపోవడంతో ఏసీలో నిల్వ చేసుకున్నాడు. ఆలస్యంగా విక్రయించినప్పటికీ అనుకున్న ధర రాలే దు. నాలుగేండ్ల క్రితం చిన్న కుమార్తె వివాహానికి కూడా అప్పు చేశాడు. సుమారు రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. బ్యాంకులో ఉన్న అప్పు రూ.2 లక్షల వరకు మాఫీ కాలేదు. దీంతో అప్పులు ఎ లా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపంతో ఈనెల 25న పొలం వద్దకు వెళ్లి గడ్డి మం దు తాగి ఇంటికి వచ్చి పడిపోయాడు. కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.