వాడవాడలా మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులకు సన్మానాలు.. గ్రామాలు, పట్టణ వీధుల్లో ప్రభుత్వ పథకాలపై హరివిల్లు వన్నెల రంగవల్లులు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు.. పుష్పాభిషేకాలు.. ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ అంటూ నినా దాలు.. మొత్తానికి ఉమ్మడి జిల్లాకు ‘మహిళా బంధు’ సంబురాలు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి.. టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనియాడారు..
ఖమ్మం, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ మహిళలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యం ఇచ్చి వారికి పెద్దన్నలా నిలిచారని, మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని మమత ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన మహిళా బంధు వేడుకలో ఆయన మాట్లాడారు. పేదల కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసిన ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వారి కష్టాలు తీర్చారన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి పథకం, ప్రతి రంగంలో వారికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 10.27 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 10 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందాయన్నారు. సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఆడపిల్ల పెళ్లి పేదలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అందించే సాయాన్ని పెండ్లికుమార్తె, తల్లి పేరిట ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తుచేశారు. నగరంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేయడం తనకు మరచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు.
70 ఏళ్ల పాటు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. గుజరాత్లో సుధీర్ఘ కాలం పాటు సీఎంగా ఉన్న మోదీ ఇప్పుడు ప్రధానిగా దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలకు పాల్పడుతున్నాయన్నారు. డబ్బుతో పదవులు కొనుక్కున్న నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరుపారేసుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం ఖమ్మం నగరంలో 279 మందికి, రఘునాథపాలెం మండంలో 22 మందికి రూ.3.01 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. తర్వాత ఉన్నత పదవుల్లో ఉండి ప్రజలకు ఉత్తమ సేవలను అందిస్తున్న పలువురు మహిళలను సత్కరించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళలు రాఖీలు కట్టారు. పుష్పాభిషేకం చేశారు. జై కేసీఆర్ అంటూ నినదించారు. సభలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు మంచిరోజులు వచ్చాయన్నారు. రాజకీయంగా వారికి గుర్తింపు లభించిందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేయూతనిచ్చిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంచినీటి కోసం వీధి పంపుల వద్ద పోట్లాట జరిగిందన్నారు. ఇప్పుడు ఇంటింటికీ తాగునీరు అందుతుండడంతో ఇబ్బందులు తప్పాయన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దేశావ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. గతంలోని ప్రభుత్వాలు మహిళలపై వివక్ష చూపించాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాజకీయ రంగంలోనూ ప్రాధాన్యత పెంచారన్నారు.
ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
బోనకల్లు, మార్చి 6: మహిళల అభ్యున్నతే ధ్యేయమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. బోనకల్లులో ఆదివారం నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో సర్పంచ్‌లు షేక్ బీజాన్బీ, కిన్నెర వాణి, ఎంపీటీసీలు కోటపర్తి హైమావతి, చేపూరి సునీత, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బోయినపల్లి వెంకటరాజ్యంతోపాటు పలువురిని సన్మానించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మహిళా అభివృద్ధికి అనేక పథకాలను రూపొందించారన్నారు. ఏ రాష్ట్రంలో మహిళలకు ఇవ్వని ప్రాధాన్యం రాష్ట్రంలో ఇస్తున్నారన్నారు. ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు కొమ్మినేని ఉపేందర్, చిలకా వెంకటేశ్వర్లు, నాయకులు బంధం శ్రీనివాసరావు, బానోతు కొండా, శ్రీనివాసరావు, నాగరాజు, శ్రీనివాసరావు, హనుమంతరావు, నారాయణ, వెంకటేశ్వర్లు, నరసింహారావు, రేగళ్ల వీరయ్య, పిల్లెం వెంకటేశ్వర్లు, చెరుకు రామకృష్ణ, తోటకూర అనంతరాములు, సాదినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లి, మార్చి 6: మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన మహిళా బంధు వేడుకలో ఆయన మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యేకు నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పుష్పాభిషేకం చేశారు. ‘కేసీఆర్’ అక్షర రూపంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కూర్చున్నారు. జై కేసీఆర్.. అంటూ నినదిస్తూ సభకు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. మహిళా దినోత్సవాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను సన్మానించాలన్నారు. అనంతరం 60 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, సర్పంచ్‌లు తేజావత్ తావూనాయక్, దొడ్డపనేని శ్రీదేవి, భూక్యా పంతులి, సీడీసీ చైర్మన్ ముక్కర భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, మార్చి 6: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మహిళా బంధు సంబురాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారన్నారు. అనంతరం మహిళా పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, రెవెన్యూ, వైద్యశాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులను సత్కరించారు. అనంతరం 43 మంది లబ్ధిదారులకు రూ.43.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, పార్టీ మండల కార్యదర్శి దొడ్డా రమేష్, ఉప సర్పంచ్ దారా యుగంధర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు, సొసైటీ డైరెక్టర్ ఎల్లిన రాఘవరావు, ముఖ్యనేతలు చామర్తి గోపిశాస్త్రి, జారె ఆదినారాయణ, రావూరి వీరయ్య, గాజుబోయిన ఏసుబాబు, పానుగంటి చిట్టిబాబు, శ్రీరామవెంకట్రావు, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం అర్బన్, మార్చి 6: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 27వ వార్డు అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన మహిళా బంధు వేడుకలో మహిళా వైద్యాధికారులు, నర్సులు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. సీఎం కేసీఆర్ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్‌చైర్మన్ దామోదర్ యాదవ్, కౌన్సిలర్లు వేముల ప్రసాద్, కోలాపూరి ధర్మరాజు, రుక్మాంగధర్ బండారి, పరమేశ్ యాదవ్, అంబుల వేణు, బండి నరసింహా, పల్లపు లక్ష్మణ్, రాజా నళిని జయంతి, మాదా సత్యవతి, సుజాత, అఫ్జల్ ఉన్నీసా బేగం, కో-ఆప్షన్ మెంబర్ కనుకుంట్ల పార్వతి, టీఆర్ఎస్ నాయకులు వనమా రామకృష్ణారావు, ఎంఏ రజాక్, మసూద్, కేకే శ్రీను, వాసు, కుమార్, శ్రీను, నాగేందర్, గౌస్, కాజా, నాగేశ్వరరావు, శ్రీరాములు, యాకూబ్, జానీ, సందీప్, కాళి, ఈశ్వర్, మున్నా, సృజన, మెరుగు అనసూర్య పాల్గొన్నారు.