తాండూర్ : ఇందిరమ్మ కాలనీ ( Indiramma Colony ) వాసుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ డి మనోజ్ (Sub-Collector Manoj) అన్నారు.
మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీని సోమవారం పరిశీలించారు.
2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందివ్వగా నేటి వరకు ఆ కాలనీలో విద్యుత్, మంచినీటి సమస్య అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం ఎవరు చేపట్టలేదని బాధితులు వెల్లడించారు. నివేదికను తయారుచేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని వివరించారు.
ఆయన వెంట తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల వెంకటేష్, విద్యుత్ శాఖ ఏఈ జాన్, ఎంపీవో అనిల్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎజాజోద్దీన్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ తోపాటు, ఇతర అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.