ధర్మారం, మార్చి 29: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కక్షిదారుల దాహార్తిని తీర్చడానికి సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా దీనిని సోమవారం కోర్టు జడ్జి మట్ట సరిత ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొట్ల లక్ష్మీ నర్సయ్య, కోశాధికారి నూనె సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి అకారి రాజేశం, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ భీమరపు సంపత్, న్యాయవాదులు ఎంపెల్లి ప్రకాష్, జాడి రజిత, నలిగేటి కళ్యాణి పాల్గొన్నారు.