Israel: ఇజ్రాయెల్‌లో 6008 మందికి గాయాలు.. నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
Israel: ఇరాన్ జరిపిన ప్రతిదాడి వల్ల 6008 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్‌తో పాటు హిజ్బుల్లా చేసిన దాడుల వల్ల భారీ మొత్తంలో ఇజ్రాయిలీ ప్రజలు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గత 4 వారాల్లో మొత్తం 15 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరి మృతిచెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ద్రువీకరించింది.
జెరుసలాం: అమెరికా-ఇజ్రాయెల్(Israel) దళాలు చేపట్టిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి జరిగిన ఇరాన్ దాడుల్లో సుమారు 6008 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్‌తో పాటు హిజ్బుల్లా చేసిన దాడుల వల్ల భారీ మొత్తంలో ఇజ్రాయిలీ ప్రజలు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో సుమారు 232 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. అయితే గత నాలుగు వారాల్లో మొత్తం 15 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ సమాచారాన్ని ఆ దేశ అంబులెన్స్ సర్వీసు పేర్కొన్నది. మరో వైపు ఇరాన్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఇజ్రాయెల్-అమెరికా బలగాలు నిర్వహిస్తున్న సైనిక ఆపరేషన్ వల్ల .. ఇరాన్లో ఇప్పటి వరకు సుమారు 1900 మంది మరణించినట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ పేర్కొన్నది. మరో 20 వేల మంది గాయపడినట్లు ఇరాన్ చెప్పింది.
అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరి మృతిచెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ద్రువీకరించింది. తమ దేశంలో వీరులు మరణిస్తున్నారని, అయినా కానీ తాము అదే బలంతో ముందుకు వెళ్లనున్నట్లు ఓ ప్రకటనలో ఇరాన్ తెలిపింది. వీరుడైన కమాండర్‌ను కోల్పోయినా.. తమ నావికులు మాత్రం హోర్ముజ్ జలసంధిలో శత్రువులను చీల్చిచెండాడుతున్నారని ఆ ప్రకటనలో వెల్లడించారు. 2018 నుంచి ఇరాన్ నేవీకి తంగసిరి చీఫ్‌గా ఉన్నారు. గత గురువారం జరిగిన దాడిలో అతను ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

