హైదరాబాద్ : ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, బేవరెజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ రావు అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ పెంపుతోపాటు అనేక వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ను ఆయన అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయం పట్ల లక్షలాది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
గ్రాట్యుటీ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ , ఇతర చిన్న ఉద్యోగులకు వేతనాలు పెంపు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి సీఎం చెంపపెట్టులా సమాధానం చెప్పారని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతతో పని చేయాలని కోరారు.