ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి చాలామంది ఇప్పుడు ‘సలాడ్స్’నే ఆశ్రయిస్తున్నారు. పండ్లతోనేకాదు.. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలనూ ఈ రూపంలోనే తీసుకుంటున్నారు. పచ్చిగానే తింటూ.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతున్నారు. సలాడ్స్ తయారీలో రకరకాల పండ్లు, కూరగాయలను ఉపయోగిస్తాం. ఇందుకోసం ఒక్కసారే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే, కొన్నిరకాల పండ్లు, కూరగాయలు రెండు, మూడు రోజులకే కుళ్లిపోతాయి. మరి, ఆరోగ్యానికి భరోసా ఇచ్చే సలాడ్స్ తాజాగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాల్సిందే!