Anjeer Fruit | అంజీర్ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలో మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి. అంజీర్ డ్రై ఫ్రూట్స్ చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ ఈ పండ్లు అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. అంజీర్ పండ్లను తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే వర్షకాలం సీజన్లో మాత్రం ఈ పండ్లను రోజూ తినాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కానీ ఈ పండ్లను తింటుంటే ఆ సమస్య రాకుండా చూసుకోవచ్చు.
అంజీర్ పండ్లలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధులకు చెక్ పెడతాయి. రోగ నిరోధక. శక్తి పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల అంజీర్‌ను ఈ సమయంలో తింటే మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ పేగుల్లో ఆహారం సులభంగా కదిలేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
వర్షాకాలంలో దగ్గు, జలుబుతోపాటు ఇన్ఫెక్షన్ల సమస్య అధికంగా ఉంటుంది. కనుక అంజీర్ పండ్లను తింటే మేలు జరుగుతుంది. ఈ పండ్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. వర్షాకాలంలో కొందరు తీవ్రమైన అలసట బారిన పడుతుంటారు. అలాంటి వారు శక్తి లభించాలంటే రోజూ అంజీర్ పండ్లను తినాలి. వీటిని తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు, యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. వర్షాకాలంలో అధిక తేమ కారణంగా అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. కానీ అంజీర్ ను తింటే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
అంజీర్ పండ్లను కేవలం వర్షాకాలంలోనే కాదు, ఇతర ఏ సీజన్లో అయినా సరే తినవచ్చు. ఈ పండ్లను తింటే పైన తెలిపిన విధంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నిషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అంజీర్ పండ్లను తినేముందు బాగా కడగాలి. తరువాత నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను ఉదయం తినవచ్చు. లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం తినవచ్చు. దీంతో సులభంగా జీర్ణమవుతాయి. వాటిల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇలా అంజీర్ పండ్లను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.