Kodada : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కాపర్ దొంగలు నలుగురు అరెస్ట్
కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
కోదాడ, సెప్టెంబర్ 02 : కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డితో కలిసి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తమ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేస్తున్నారని మునగాల మండలానికి చెందిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు బరాకతగూడెం కెనాల్‌పై పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా మునగాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం వెలుగుచూసింది.
నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు పట్టణానికి చెందిన పాలకుర్తి వెంకటరామయ్య. గుంటకల్ రాజేశ్వరరావు. బోయపాటి అశోక్. దేవరకొండ ఇషాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి బలి శ్రీకాంత్ పరారీలో ఉన్నట్టు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వీరి వద్ద నుండి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకటరామయ్య గతంలో కూడా కాపర్ దొంగతనాలు చేశాడని, ఈ వైర్ ను ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కిలో రూ.400 చొప్పున అమ్మినట్టు తెలిపారు. వీరంతా కలిసి సుమారు 5 క్వింటాళ్ల కాపర్ ను దొంగతనం చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ బి.ప్రవీణ్ కుమార్, ఐడీ పార్టీ స్టాఫ్ రామారావు, కొండలు, సూర్యాపేట సీసీఎస్ ఎస్ఐ హరికృష్ణ, యాదవేంద్ర రెడ్డి, సిబ్బంది మల్లేశ్, శివ, ఆనంద్‌ను డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

