Bhagwant Mann | వరద బాధితురాలి ఆవేదన విని కంటతడి పెట్టిన పంజాబ్ సీఎం.. Video
Bhagwant Man | పంజాబ్ సీఎం (Punjab CM) భగవంత్ మాన్ (Bhagawanth mann) భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ (Ferozpur) జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను భగవంత్ మాన్ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వరదలవల్ల ప్రభావితమైన బాధితులను పరామర్శించారు.
Bhagwant Man : పంజాబ్ సీఎం (Punjab CM) భగవంత్ మాన్ (Bhagwanth mann) భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ (Ferozpur) జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను భగవంత్ మాన్ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వరదలవల్ల ప్రభావితమైన బాధితులను పరామర్శించారు. వారి బాధలను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలు వెలిబుచ్చిన ఆవేదన విని ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడ్చేశారు. అందరికీ అండగా ఉంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఏడుస్తూనే ఆమెకు ధైర్యం చెప్పారు.
అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ సంక్షోభంలో ఉన్నా ఆ సంక్షోభం నుంచి బయటపడేవరకు పంజాబ్ అండగా ఉందని, ఇప్పుడు పంజాబ్ సంక్షోభంలో ఉన్నదని, యావత్ భారతదేశం పంజాబ్‌కు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తనతో ఫోన్లో మాట్లాడారని, రాష్ట్రంలో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో వరదల బీభత్సం ఇంకా ఆగలేదని భగవంత్ మాన్ తెలిపారు. ఇంకా పలు ప్రాంతాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్నారు. పంజాబ్‌ను 1888లో భారీ వరదలు ముంచెత్తాయని, ప్రస్తుతం వరద పరిస్థితి అంతకంటే దారుణంగా ఉన్నదని చెప్పారు.
#WATCH | Ferozepur: Punjab CM Bhagwant Mann says, “When the country was in crisis, Punjab always stood with the nation… Today, Punjab is in crisis, and I am fully hopeful that the entire country will stand with Punjab. The Prime Minister and the Home Minister called, and they… https://t.co/k1beED4w8C pic.twitter.com/v6q4AInkYK
— ANI (@ANI) September 2, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

