Lychee | ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు కనిపిస్తాయి. రహదారుల పక్కన బండ్లపై కూడా ఈ పండ్లను విక్రయిస్తుంటారు. అవే.. లిచీ పండ్లు. మీద ఎరుపు రంగు తొక్క ఉంటుంది. లోపల క్రీమ్ లాంటి తెల్లని గుజ్జు అందులో నల్లని విత్తనాలు ఉంటాయి. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పండ్లను తింటే శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. లిచి పండ్లలో అద్బుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తియ్యని రుచిని కలిగి ఉంటాయి. అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్లలో ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. లిచి పండ్లలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది.
లిచి పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లిచి పండ్లను తింటే శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా రక్త నాళాల వాపులను తగ్గించుకోవచ్చు. దీని వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. లిచి పండ్లలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, రుటిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
లిచి పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. లిచి పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
లిచి పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. లిచి పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ పండ్లను కూడా మోతాదులోనే తినాల్సి ఉంటుంది. లిచి పండ్లను పచ్చివి తినకూడదు. పండువే తినాలి. పచ్చిగా ఉండే లిచిలలో హైపో గ్లైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కనుక మీరు తినే లిచి పండ్లు బాగా పండినవే అని నిర్దారించుకున్న తరువాతే తినండి. ఇలా ఈ పండ్లను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.