Election Commission | కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఆయనకు రెండు గుర్తింపు కార్డులు ఉన్న నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది. న్యూఢిల్లీ జిల్లా ఎన్నికల కార్యాలయం కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నందుకు నోటీస్ పంపింది.
ఓట్ల చోరీపై కాంగ్రెస్ను తిడుతూ భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పవన్ ఖేరాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పవన్ ఖేరా రెండు నియోజకవర్గాల ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ రెండు గుర్తింపు కార్డు నంబర్లను బయటపెట్టారు. ఒకటి జంగ్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో.. మరొకటి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నది. ఈ రెండు నియోజకవర్గాలు తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి.