Fire accident : హర్యానాలో ఘోరం జరిగింది. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఇంట్లోని నలుగురు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. హర్యానా రాష్ట్రం గుర్గావ్ నగరంలోగల సరస్వతి ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇంట్లో అగ్నికీలలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
#WATCH | Haryana: Four people died after a fire broke out at a house in Saraswati Enclave in Gurugram last night. Fire has been brought under control. pic.twitter.com/cuX9d9gfhJ
— ANI (@ANI) October 26, 2024