లడఖ్: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని హాన్లే వ్యాలీలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో 76 అడుగుల పొడవుగల జాతీయ పతాకం రెపరెపలాడింది. ఇండియన్ ఆర్మీ, ఫ్లాగ్ ఫౌండేషన్ కలిసి రూపొందించిన ఈ జాతీయ పతాకాన్ని హన్లే వ్యాలీలోని 15 వేల అడుగుల ఎత్తయిన ప్రదేశంలో ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాతీయ జెండాను ఆవిష్కరించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | A 76 ft tall National Flag at 15000 ft constructed by Indian Army and Flag Foundation of India, hoisted overlooking the Hanle Valley in Ladakh: Fire and Fury Corps, Indian Army
— ANI (@ANI) November 21, 2021
(Video Source: Fire and Fury Corps Twitter account) pic.twitter.com/Wi9zfgs18m