మహబూబాబాద్, మార్చి 12 : విజ్ఞానభారతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉచిత గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ప్రా రంభిస్తామని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రకటించారు. శనివారం మానుకోట జిల్లా కేంద్రంలోని వి జ్ఞానభారతి పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు.. నిధులు.. ని యామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలం గాణలో అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగా ప్రజలు తాగు, సాగు నీటి ని ఉపయోగించుకుంటున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్లో 27 కిలోమీటర్ల కృత్రిమ రిజర్వాయర్, 15 కిలోమీటర్ల కొండపోచమ్మ రిజర్వాయర్‌ను దేశం మొత్తం అబ్బురపడేలా నిర్మించారన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను పంటలతో సస్యశ్యామలం చేశారని కొనియాడారు. ఇక నిధుల విషయంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణలో రూ.2.56లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సైతం రూ.2.56లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టుకుందని వివరించారు. దళితబంధు కోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించినది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.3లక్షలు అందజేస్తుందని, ఈ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన 91,142 ఉద్యోగ ఖాళీ ల భర్తీ ప్రకటనతో యువత కళ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నదని తెలిపారు. చిన్న జిల్లా అయినప్పటికీ మానుకోటకు సైతం 1,172 ఉద్యోగాలను ప్రకటించడం విశేషమన్నారు. ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. విజ్ఞాన భారతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో దుష్యంత్రావు, యశ్వంత్‌రావు నేతృత్వంలో ఉచిత గ్రూప్స్ కో చింగ్ సెంటర్ ప్రారంభిస్తామని, నాణ్యమైన మెటీరియ ల్ అందజేస్తామని చెప్పారు. గిరిజన జిల్లాలోని నిరుపేద విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్నగౌడ్, కొండపల్లి కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.