వరంగల్, మార్చి 12 : క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ -2022 రాష్ట్రస్థాయి పోటీలను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా, నగర పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు రావడంతో వరంగల్ సందడిగా మారిందని అన్నా రు.
తెలంగాణలో పోలీసులు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. పోలీస్ కమిషనర్ క్రీడల నిర్వహణపై చూపిస్తున్న ఆసక్తి సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె అన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడమే వరంగల్ పోలీసుల లక్ష్యమని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 150 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. విజేతలకు రూ.లక్షన్నర నగదు బహుమతులు అందజేస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, ఆదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, సంజీవ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, ఏసీపీ జితేందర్‌రెడ్డి, గిరికుమార్, శ్రీనివాస్, కృష్ణ, ఇన్స్పెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.