మహిళాబంధు వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం ప్రజాప్రతినిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందుతున్న మహిళా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలుకరించి వారిని ఘనంగా సన్మానించారు. పలు గ్రామాల్లో మహిళలకు ఆటలపోటీలు నిర్వహించగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఖిలావరంగల్, మార్చి 7: వరంగల్ 34వ డివిజన్లోని శ్రీరామ కల్యాణ మండపంలో ఏఎంసీ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఆర్పీలు, ఆశ కార్యర్తలను ఘనంగా సత్కరించారు. మహిళలు ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం అన్నదానం చేశారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పగడాల సతీశ్, నాయకులు కలకొండ అభినాశ్, తిరుపతి పాల్గొన్నారు. 37వ డివిజన్లోని గిరిప్రసాద్‌నగర్, బుడిగజంగాల కాలనీ, తూర్పుకోటలో కార్పొరేటర్ బోగి సువర్ణాసురేశ్, మాజీ కార్పొరేర్ బిల్లా కవితా శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సెల్ఫీలు దిగారు.
టీఆర్ఎస్ నాయకులు, గిరిప్రసాద్‌నగర్ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, సంగరబోయిన చందర్, సిరబోయిన వాసుదేవ్, లావణ్య, శోభ, సరిత, కవిత, రాణి పాల్గొన్నారు. 38వ డివిజన్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమాదామోదర్యాదవ్ ఆధ్వర్యంలో ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. 17వ డివిజన్లోని వసంతపురం, ఆదర్శనగర్, బొల్లికుంట, గాడిపల్లిలో కార్పొరేటర్ గద్దె బాబు ఆధ్వర్యంలో మహిళాబంధు వేడుకులు నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి.. మహిళలను కలిసి..
వర్ధన్నపేట/వరంగల్‌చౌరస్తా/కరీమాబాద్/కాశీబుగ్గ/పోచమ్మమైదాన్/మట్టెవాడ: వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, మహిళా కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ పథకాలు అందుకున్న మహిళలకు ఇండ్లకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొ శాలువాలతో సత్కరించారు. వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి, రామవరం, ఇల్లంద, ల్యాబర్తి, చెన్నారం, ఉప్పరపల్లిలో మహిళాబంధు వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సన్మానించారు.
జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు. వరంగల్ 28వ డివిజన్ పరిధిలో శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఆశ కార్యకర్తలను మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఘనంగా సత్కరించారు. 26వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో మహిళాబంధు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం శోభ, ఆవుల రామాదేవి, మల్లేశ్వరి, శైలజ, తేజస్విని, శ్యామల, తొనుపునూరి వీరన్న, నాగవెళ్లి ప్రవీణ్, మాగంటి శివ, రాంచందర్, శివ, రాజు, వినయ్ పాల్గొన్నారు. వరంగల్ 32, 33, 39, 40, 41, 43వ డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, ఈదురు అరుణ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వరంగల్ 20వ డివిజన్ కాశీబుగ్గలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి మాజీ స్టాండింగ్ కమిటి సభ్యుడు బయ్యాస్వామి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పలు రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో ఇక్బాల్, పెండ్యాల సోనీబాబు, రేణిగుంట్ల కవిత, మిట్టపల్లి కళాపతి, సుంకరి భాగ్యలక్ష్మి, గీతా చంద్రకళ, ఆశ వర్కర్లు మంజుల, సునీత పాల్గొన్నారు. 19వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ ఆధ్వర్యంలో మహిళాబంధు వేడుకలు నిర్వహించారు.
వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ వైఎస్ చైర్మన్ తేజస్విని, హెచ్ఎం టీ కవిత, ఉపాధ్యాయులు నీరజ, లక్ష్మి, స్వప్న, వంట సిబ్బంది సరిత, జ్యోతిని సన్మానించారు. ఉపాధ్యాయులు నవీన్, శివకుమార్, హరి, నాగభూషణం, తిలక్, శ్రీనివాస్, రమేశ్, కుమారస్వామి పాల్గొన్నారు. మట్టెవాడ 29వ డివిజన్లో కల్పలత సూపర్‌బజార్ వైస్ చైర్మన్ ఎండీ షఫీ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళా పింఛన్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాల్వే రాజు, ఎస్కే రహమాన్, ఎండీ రఫీ పాల్గొన్నారు.
మహిళలకు అధిక ప్రాధాన్యం
నర్సంపేట/ఖానాపురం/చెన్నారావుపేట/నెక్కొండ: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. నర్సంపేటలోని జూనియర్ కళాశాల ఆవరణలో మహిళలకు క్రీడాపోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఖానాపురం మండలం ఐనపల్లి ఐటీఐ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో మహిళలకు మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకూడదన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన నడక, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్పయ్య, సర్పంచ్‌లు కాస ప్రవీణ్‌కుమార్, బీ ఐలయ్య, గొర్రె కవిత, వైస్ ఎంపీపీ ఉమారాణి, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, ఏపీఎం సుధాకర్ పాల్గొన్నారు.
చెన్నారావుపేటలోని సిద్ధార్థ గురుకుల విద్యాలయంలో మహిళలకు నిర్వహించిన మండలస్థాయి క్రీడాపోటీలను జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళాభివృద్ధికి సర్కారు చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లలిత, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎంఏ గఫార్, సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి, క్రీడల ఇన్చార్జి, టీఆర్ఎస్ నాయకులు కంది కృష్ణచైతన్యారెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, నాయకులు పాల్గొన్నారు.
నెక్కొండలో క్రీడాపోటీలను పెద్ది స్వప్న ప్రారంభించారు. మహిళలకు విద్య, వైద్యం, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయ రంగం, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇందిర క్రాంతి పథం ఏపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో మహిళలకు ఖోఖో, పరుగు పందెం, కబడ్డీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజన హరికిషన్, తాసిల్దార్ వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, దామోదర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, సోమయ్య, శివకుమార్, వీరభద్రయ్య, కుమారస్వామి, సత్యం, సర్పంచ్‌లు రాజేశ్వర్‌రావు, పూర్ణ, రుక్మిణి, అనిత, సరిత, పారిజాతం పాల్గొన్నారు. వనప్రేమికుడు నల్లగొండ సమయ్య పెద్ది స్వప్నతో కలిసి మొక్కలు నాటారు.
సమాజంలో మహిళల పాత్ర గొప్పది..
దుగ్గొండి/రాయపర్తి/నర్సంపేటరూరల్/నల్లబెల్లి: సమాజంలో మహిళల పాత్ర గొప్పదని దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అన్నారు. దుగ్గొండిలో ప్రశాంతి మహిళా సమా ఖ్య, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, తాసిల్దార్ సంపత్‌కుమార్, ఎస్సై వంగల నవీన్‌కుమార్, ఎన్నారై శానబోయిన రాజ్‌కుమార్, సర్పంచ్ తోకల మంజులా నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మోర్తాల రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, సాంబలక్ష్మి, శ్రీలత, రమ, పద్మ పాల్గొన్నారు.
రాయపర్తి మండలంలోని రాగన్నగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గీతాంజలి గ్రామైక్య సంఘం వీవోఏ, టీఆర్ఎస్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు సరికొండ నవల నేతృత్వంలో మహిళా ప్రతినిధులను సర్పంచ్ రెంటాల గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో సత్కరించారు. పారిశుధ్య కార్మికురాలు గోపు పద్మ, గీతాంజలి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు పులుగు రాణి, దండు మల్లికాంబ, మాజీ అధ్యక్షురాలు కుంభం లలిత, ఆకుల ఉపేంద్ర, కోల రాజమ్మను ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ కంది ప్రభాకర్, సరికొండ యాకూబ్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట మండలం రాజపల్లిలో సర్పంచ్ నామాల భాగ్యమ్మ మహిళలకు రన్నింగ్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళా సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. వార్డు సభ్యులు నిర్మల, మంజుల, పుషమ్మ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
నల్లబెల్లిలోని కారుణ్యజ్యోతి పాఠశాలలో మహిళలకు నిర్వహించిన క్రీడా పోటీలను తాసిల్దార్ మంజుల, ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ ప్రారంభించారు. మహిళలతో కలిసి తాసిల్దార్ కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్ నానెబోయిన రాజారాం, వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, ఎస్సై నార్లాపురం రాజారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు తేజావత్ సమ్మయ్యనాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, కార్యదర్శి అనూష, మోహన్‌రెడ్డి, తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.