అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి.. రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలను ఘనంగా సన్మానించారు.
నర్సంపేట/వర్ధన్నపేట, మార్చి 6: నర్సంపేటలో ఆదివారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ మహిళలతో కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం మహిళల పాలిట దేవుడని, కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రాజకీయంగా మహిళలకు పురుషులతో సమానంగా అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, గుడిపూడి అరుణ-రాంచందర్‌రావు, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, బానాల ఇందిర, శ్రీదేవి, కవిత, వాసం కరుణ పాల్గొన్నారు. వర్ధన్నపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు, మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ ఆధ్వర్యంలో పట్టణంలో కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఇతర మహిళా సిబ్బంది, మహిళా వార్డు సభ్యులను జీపీల్లో ఘనంగా సత్కరించారు.
ఆడబిడ్డలను గుర్తించిన ఘనత కేసీఆర్‌దే..
ఖిలావరంగల్: తెలంగాణలో మహిళలకు సరైన గౌరవం, గుర్తింపునిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ ఎస్డీ రిజ్వానా షమీమ్ అన్నారు. చింతల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం ‘థ్యాంక్యూ కేసీఆర్’ అంటూ మహిళలు మానవహారం చేపట్టారు. ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అంగన్వాడీ, ఆశ కార్యర్తలకు వేతనాల పెంపు, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థినులకు గురుకులాలు ఏర్పాటు చేసి ఉజ్వల భవిష్యత్‌కు కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డివిజన్ స్వయం సహాయక సంఘాల ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, టీఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. ఖిలావరంగల్ 37వ డివిజన్ తూర్పుకోటలో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్ బిల్లా కవిత ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. ‘మహిళాబంధు సీఎం కేసీఆర్’ అంటూ ప్ల కార్డులు చేతబూని నినదించారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్మికులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, టీఆర్ఎస్ నాయకులు బిల్లా శ్రీకాంత్, మంద శ్రీధర్‌రెడ్డి, కవిత, స్వర్ణ, రాధిక, కౌసర్, కరీమా, కోమల, శోభ, రమాదేవి, బిల్ల రవి, విజయ్, రాంబాబు, చందర్, వాసుదేవ్ పాల్గొన్నారు. పడమరకోటలోని అమరవీరుల స్తూపం వద్ద 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్‌యాదవ్ ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు. శివనగర్‌లో 34, 35వ డివిజన్ల కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో మహిళలు సంబురాలు నిర్వహించారు. అలాగే, పుప్పాలగుట్ట, గాడిపల్లి, వసంతపురం, బొల్లికుంట, ఆదర్శనగర్‌లో వేడుకలు జరిగాయి.
మహిళలను మహారాణులు చేస్తున్నారు..
కరీమాబాద్/వరంగల్‌చౌరస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమంతోపాటు అభివృద్ధికి కృషి చేస్తూ వారిని మహారాణులుగా చేసే దిశగా చర్యలు చేపట్టారని పలువురు కార్పొరేటర్లు అన్నారు. వరంగల్ 32, 33, 39, 40, 41, 43వ డివిజన్ల కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, ఈదురు అరుణ ఆధ్వర్యంలో మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వరంగల్ 24, 27వ డివిజన్లలో వేడుకలు జరిపారు. వరంగల్ చౌరస్తాలో శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 24వ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు ఆకుతోట శిరీష్ ఆధ్వర్యంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ఎస్కే గోరేమియా, నాగవెళ్లి ప్రవీణ్, రుద్రోజు జగన్, ఆకుతోట కుమారస్వామి, వస్కుల ఉదయ్‌కుమార్, మట్వాడ కుమార్ పాల్గొన్నారు.
మహిళలకు ఘన సన్మానం..
కాశీబుగ్గ: వరంగల్ 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్ పైడిపల్లిలో ఆశ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, డ్వాక్రా మహిళలు, ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా కుమార్‌యాదవ్, నాయకులు నేరెళ్ల రాజు, బొచ్చు రాజు, పండుగ రవీందర్‌రెడ్డి, ముత్యాల శిరీషా సతీశ్, కుమార్, చీర్ల రవీందర్ పాల్గొన్నారు. ఎస్ఆర్నగర్లో 14వ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేతిరి రాజశేఖర్, పసులాది మల్లయ్య, మాచర్ల స్టాలిన్, అమర్రాజు కుమార్, రాపర్తి సతీష్, కేతిరి సమ్మక్క, పసునూరి సరిత పాల్గొన్నారు. ఎనుమాముల బాలాజీనగర్ జంక్షన్లో కార్పొరేటర్ తూర్పాటి సులోచనా సారయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి పాలాభిషేకం చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఆర్పీలను సత్కరించారు. 20వ డివిజన్ శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయ మైదానంలో కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి సంబురాలు జరిపారు. మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, మహిళలు పాల్గొన్నారు. 19వ డివిజన్లో కార్పొరేటర్ స్వర్ణలత ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
మహిళా సాధికారతే సర్కారు ధ్యేయం
నల్లబెల్లి: మహిళా సాధికారతే తెలంగాణ సర్కారు ధ్యేయమని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ అన్నారు. మండలకేంద్రంలోని జీపీ ఆవరణలో మహిళలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపఠానికి రాఖీలు కట్టి మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకుని వారికి మండల మహిళల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అథిదిగా ఎంపిపి పాల్గొని మాట్లాడారు. నిరుపేద ఆడబిడ్డలకు సిఎం కేసిఆర్ అన్ని తానై కళ్యాణలక్ష్మి, సాధీముభారక్ పథకం చేపట్టి లక్ష రూపాయల నిధులు వెచ్చించి అమ్మాయిల వివాహలు జరిపిస్తూ ఆడబిడ్డలకు మేనమామ అయ్యారని తెలిపారు. అలాగే మహిళా సంఘాల అభ్యున్నతికి పెద్దపీట వేయటమే గాక ఎన్నికలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి పురుషాధిక్య సమాజంలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. అలాగే త్వరలో కోట్లాది రూపాయలు విడుదల చేసి మహిళాబందు తీసుకురావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు ఎన్. రాజారాం, గోనె శ్రీదేవి, మండల కోఆప్సన్ సభ్యురాలు ఎండి నజీమానన్నెసాహెబ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, కార్యదర్శి అనూష, రమ, పావని, లక్ష్మి, సువర్ణ, శ్రీలత, కల్పన, సుమలత, అనిత తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నర్సంపేటరూరల్/రాయపర్తి/గీసుగొండ/దుగ్గొండి/పర్వతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నర్సంపేట ఎంపీపీ మోతె కళావతి అన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎంపీపీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పాల్తియ సరస్వతి, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఉపాధ్యక్షుడు కట్ల సుదర్శన్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉల్లేరావు రజిత, సుంకరి లావణ్య, రమ, రేణుక, పద్మ, కల్యాణి, విజయ, శ్రీలత, భాగ్య, రజిత, సునీత పాల్గొన్నారు. రాయపర్తిలోని జీపీలో టీఆర్ఎస్ మండల కమిటీ నేతృత్వంలో మహిళా పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ గారె నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఎంపీటీసీ అయిత రాంచందర్, కే రాంచంద్రయ్య, నర్సింహామూర్తి పాల్గొన్నారు.
మహిళా శక్తి గొప్పదని గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య అన్నారు. గీసుగొండ, మరియపురంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సీసీలు నిర్మలామేరీ, శోభారాణి, మహిళలు పాల్గొన్నారు. దుగ్గొండిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ కాట్ల కోమల, మండల సమాఖ్య అధ్యక్షురాలు సాంబలక్ష్మి నేతృత్వంలో మహిళా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు రాఖీలు కట్టి సంబురాలు నిర్వహించారు. పర్వతగిరిలో ఎంపీపీ కమల, సర్పంచ్ చింతపట్ల మాలతీరావు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రాఖీ కట్టారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, చింతపట్ల సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, ఉపసర్పంచ్ రంగు జనార్దన్‌గౌడ్, రమేశ్, ఎన్ బాబు, బీ విజయ పాల్గొన్నారు.