మట్టెవాడ/పోచమ్మమైదాన్/వరంగల్‌చౌరస్తా, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళాబంధు సంబురాలు ఆదివారం మిన్నంటాయి. ఇందులో భాగంగా వరంగల్ 29వ డివిజన్లో జరిగిన కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. అలాగే, పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లను సన్మానించి, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుసుమ లక్ష్మీనారాయణ, కొడకండ్ల సదాంత్, శ్రీరాములు సురేశ్, రాచర్ల రాము పాల్గొన్నారు. వరంగల్ 25వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు శిరీషా శ్రీమాన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలను సన్మానించారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు.
అలాగే, మహిళలు ఉత్సాహంగా పలు రకాల ఆటలు ఆడి క్రీడా నైపుణ్యాన్ని చాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, ఆర్పీలు, మహిళా నేతలను సత్కరించారు. విశ్రాంత డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కంకల జయశ్రీ, నాగార్జున విద్యా సంస్థల అధినేత్రి ఆడెపు లక్ష్మీని సన్మానించారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్ మహిళా సంఘాల సభ్యులను సత్కరించారు. 22వ డివిజన్ పోచమ్మమైదాన్‌లోని కెమిస్ట్రీ భవన్లో టీఆర్ఎస్ నాయకురాలు గీతా విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం పలు రంగాలకు చెందిన మహిళలను సన్మానించారు. 23వ డివిజన్ కొత్తవాడ తోటమైదానంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ ఆధ్వార్యంలో సంబురాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టి జై తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే, మహిళలు కబడ్డీ, ఖోఖో, మ్యూజికల్ చైర్ ఆటలను ఉత్సాహంగా ఆడారు. వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ కల్పన ఆధ్వర్యంలో దుర్గేశ్వరాలయంలో సంబురాలు చేశారు. ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి.