వర్ధన్నపేట, మార్చి 6: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకూ ‘బంధు’వుగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. చెన్నారంలోని ఆలయంలో ఆదివారం డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళాబంధు వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని కొనియాడారు.
రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్ల లాంటి పథకాల అమలుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, సర్పంచ్ పునుగోటి భాస్కర్‌రావు, ఉపసర్పంచ్ రాజమౌళి, మాజీ సర్పంచ్ సింధం లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్
పర్వతగిరి: సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని, ఆయన చూపిన మార్గాన్ని ఆచరించాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన సేవాలాల్ 283 జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవాలాల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని అరూరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్, ఎంపీపీ కమల పంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ చింతపట్ల మాలతీరావు, సోమేశ్వర్రావు, తాసల్దార్ మహబూబ్ అలీ, సర్వర్, చిన్నపాక శ్రీనివాస్, వెంకన్న నాయక్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోయినపెల్లి యుగేంధర్‌రావు, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, మోహన్‌రావు, వల్లందాసు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కు అందజేత
మండలంలోని దౌలత్నగర్కు చెందిన బర్ల సునీతా వెంకన్నకు మండలకేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ కల్యాణలక్ష్మి చెక్కు అందించారు. పేదింట్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు, చింతపట్ల మాలతీరావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు పాల్గొన్నారు. అలాగే, చౌటపెల్లి శివారు హట్యాతండాలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ బద్దూనాయక్ విగ్రహాన్ని అరూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్దూనాయక్ గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. ఎంపీటీసీ లావణ్య, సర్పంచ్ నీలమ్మ-వెంకట్రాంనాయక్, మాధవరావు, గోపాల్‌రావు పాల్గొన్నారు.