నర్సంపేట/నల్లబెల్లి/దుగ్గొండి/పోచమ్మమైదాన్/గీసుగొండ, నవంబర్ 13: ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. నర్సంపేటలో ఏబీఎస్ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తన రచనల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్, ప్రతాప్, రాజ్‌కుమార్, నాగరాజు, చరణ్, శ్రీకాంత్, కుమార్ పాల్గొన్నారు. నల్లబెల్లిలోని అంబేద్కర్ సెంటర్లో ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేశ్, ఆటో యూనియన్ అధ్యక్షుడు చుక్క శ్రీకాంత్, రాజు, రమేశ్, నవీన్, చందు, బాబు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి ఎంజేపీటీలో ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్, ఉపాధ్యాయులు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సమాజం కాళోజీ అడుగజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏటీపీ సుకుమార్, డిప్యూటీ వార్డెన్ సోమారాణి, ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజు, సురేశ్, కోటి, కిరణ్, శ్రీనివాస్, రమేశ్, బషీర్, రాజు, సాదిక్, సతీశ్, ప్రేమలత, రోజా పాల్గొన్నారు.
అన్యాయాలు, అక్రమాలు, అసమానతలపై నిరంతరం ప్రశ్నించే గొంతుక కాళోజీ చిరస్మరణీయుడని లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ ఆడెపు రవీందర్ అన్నారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిలక శ్యామ్, జన్ను సునీల్, జన్ను యాకూబ్, జన్ను అనిల్, పోలెపాక శ్రీకాంత్, జన్ను నవీన్, రవి, కిరణ్, విక్రమ్ పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో దూరవిద్య కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరికృష్ణ, రాజమౌళి పాల్గొన్నారు.