చౌటుప్పల్ : పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. చౌటుప్పల్‌కు చెందిన వేంరెడ్డి రాజు గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచారు. దాంతో అతడికి బీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది.
పార్టీలో మున్సిపల్ ఛైర్మన్ పదవి అనుభవించిన అతను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తన భార్య వేంరెడ్డి సంధ్యను కౌన్సిలర్‌గా బరిలో దించారు. 16వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెను ఏకంగా 374 ఓట్ల తేడాతో ఓడించి రాజుకు దిమ్మతిరిగేలా చేశారు.