వరంగల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం షురువయ్యాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో జిల్లాలో తొలిరోజైన మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. బుధవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.
రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన కేసీఆర్ బర్త్ డే సంబురాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఇక్కడి పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లోని విద్యార్థులకూ పండ్లు, బ్రెడ్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మనమంతా పండుగలా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృచేస్తున్నారని తెలిపారు.
వరంగల్‌లోని ఓ సిటీ మైదానంలోని వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు, పేదలకు నన్నపునేని భారీ గా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొద ట ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా మృత్యుంజయ సహిత చండి హోమం చేశారు. సీఎం కేసీఆర్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు, పేదలతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, అనాథల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగ రోజు అని, దేశ్‌కి నేత అన్నారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి కేసీఆర్‌కు ఉందని, దేశానికి అన్యాయం చేస్తున్న ఢిల్లీ పాలకులపై కేసీఆర్ అడుగు ముందుకు వేశారని పేర్కొన్నారు. వరంగల్ గడ్డ టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అడ్డా అని, తెలంగాణ జోలికొస్తే ఎక్కడా తగ్గేదేలేదని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్‌తో పాటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్యనేతలు, టీఎన్జీవోస్, టీజీవో నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.