లండన్ : ప్రతిరోజూ వ్యాయామం చేసినా ఎక్కువ గంటలు అదే పనిగా కూర్చుంటే ఆరోగ్యానికి పెనుముప్పని (Health Tips) వైద్యులు హెచ్చరిస్తున్నారు. టైప్ 1 మధుమేహంతో బాధపడేవారు ప్రతి అరగంటకూ మూడు నిమిషాల పాటు నడిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మెరుగ్గా మేనేజ్ చేయవచ్చని, భవిష్యత్‌లో కాంప్లికేషన్స్‌ను నివారించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
టైప్ 1 డయాబెటిస్‌లో శారీరకంగా చురుకుగా ఉండటం ముఖ్యం. నిత్యం వ్యాయామం చేసేవారు సైతం రోజంతా గంటల తరబడి కూర్చుని ఉంటే ఆరోగ్యానికి హానికరమని డయాబెటిక్ యూకే, రీసెర్చి డైరెక్టర్ డాక్టర్ ఎలిజబెత్ రాబర్ట్సన్ పేర్కొన్నారు. నడుస్తూ ఫోన్ మాట్లాడటం, బ్రేక్స్ కోసం టైమర్ సెట్ చేసుకోవడం వంటి సింపుల్, ప్రాక్టికల్ మార్పులతో ఈ అలవాటును కొనసాగించాలని రాబర్ట్సన్ సూచించారు.
ఎక్కువసేపు కూర్చోకుండా బ్రేక్ తీసుకుంటూ తరచూ కొద్దిసేపు వాకింగ్ చేయడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ బాధితులు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడమే కాకుండా, కాంప్లికేషన్స్ ముప్పును తప్పించవచ్చని గత పరిశోధనల్లో వెల్లడైంది. శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా కండరాలు గ్లూకోజ్‌ను (షుగర్) అధికంగా వినియోగించుకుంటాయి. దీంతో శరీరం మరింత సమర్ధవంతంగా ఇన్సులిన్‌ను వాడేందుకు సాయపడతాయి.
Read More
Lifestyle news | ఆ పనిలో పవర్ చూపించాలంటే.. మీ ఆహారంలో ఇవి తప్పక ఉండాల్సిందే