రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం | కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల విస్పోటనం చెందింది. శనివారం రాత్రి ఒక్కసారిగా అగ్నిపర్వం బద్దలవడంతో చిమ్ముతున్న లావాతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది.

కిన్షాసా : కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల విస్పోటనం చెందింది. శనివారం రాత్రి ఒక్కసారిగా అగ్నిపర్వం బద్దలవడంతో చిమ్ముతున్న లావాతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. అగ్నిపర్వతం చివరిసారిగా 2002లో విస్పోటనం చెందగా.. వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.

సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు యూరప్ నుంచి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ టిసెకెడి పేర్కొన్నారు. ఇప్పటికు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. లావా గోమా వైపుకంటే రువాండా వైపు వెళ్తోందని అగ్నిపర్వతాల శాస్త్రవేత్త చార్లెస్ పేర్కొన్నారు. విస్పోటనం చెందిన అగ్రిపర్వదానికి దగ్గరలో విరుంగా నేషనల్ పార్క్ దగ్గరగా ఉంది. ప్రపంచంలోని పర్వత గొరిల్లాలకు నిలయం. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

