టేకులపల్లి, సెప్టెంబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశ్వకర్మ భగవానుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మంతోజు పవన్ కుమార్ చార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జయంతి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి విశ్వ బ్రాహ్మణులు తౌడోజు భిక్షమయ్య, ధర్మపురి శ్రీనివాసచారి, చంద్రగిరి రాధాకృష్ణ, కట్టుకోజ్వల సురేష్, వజ్రాల పరిపూర్ణ చారి, చిలకమర్రి రామకృష్ణ, భౌరోజు బిక్షమయ్య, బొడ్డుపల్లి బ్రహ్మచారి, వజ్రాల బ్రహ్మయ్య, నోముల నరేందర్ పాల్గొన్నారు.