World Test Championship (WTC): న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తుదిపోరు జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. మరో మూడు రోజుల సమయం ఉండగా భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. పేస్, బౌన్స్‌కు సహకరించే పిచ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ పరిస్థితులకు వీలైనంత వేగంగా అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు.
నెట్ సెషన్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, అజింక్య రహానె చరిత్రాత్మక పోరుకు సిద్ధమవుతుండగా తీసిన ఫొటోలను బీసీసీఐ మంగళవారం ట్విటర్లో షేర్ చేసింది. బౌలర్లు వేసే బంతులను కెప్టెన్ కోహ్లీ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. కవర్ డ్రైవ్‌లతో పాటు ఫుల్ షాట్స్ ఆడాడు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తనదైన స్టైల్లో భారీ షాట్లతో చెలరేగాడు. ఇషాంత్, మహ్మద్ షమీ, జడేజా బౌలింగ్ వేశారు.
Three sleeps away from the BIG GAME. 👍👍
— BCCI (@BCCI) June 15, 2021
How excited are you? 🙌 🙌#WTC21 #TeamIndia pic.twitter.com/nqaI6cf33H
Movies, breakfast, laughter & more! 😂
— BCCI (@BCCI) June 15, 2021
DO NOT MISS: A fun round of rapid-fire with #TeamIndia members @ajinkyarahane88, @ImIshant, @cheteshwar1, @ashwinravi99 & @MdShami11 on the sidelines of a training session! 👌👌 #WTC21
Watch it all unfold 🎥 👇 pic.twitter.com/hKsSszM027