అమరచింత : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను( Market) ప్రారంభించుకున్నారు. మాజీ సర్పంచ్ చెన్నమ్మ కురుమన్న సంతను ప్రారంభించి గ్రామస్థులకు శుభాకాంక్షలు చెప్పారు.
మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Jurala Project ) నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామం ఎన్నో ఏళ్లుగా పంచాయతీ ఏర్పాటు కోసం నాటి పాలకులు స్పందించలేదని ఆయన గుర్తు చేశారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమ గ్రామం కృష్ణంపల్లి నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామస్థులంతా ఏకతాటి పైకి వచ్చే సంతను ప్రారంభించుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుష్ప, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, గ్రామ పెద్దలు కురుమారెడ్డి, వెంకటన్న, రాజు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.