మేడ్చల్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు అత్యధిక నిధులను వెచ్చించి అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు. కీసర మండలం గోధుమకుంట చంద్రకాలనీలో మాజీ సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి స్వచ్ఛందంగా సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు(CC Cameras) , పార్కులో చిన్నారులకు ఆట వస్తువులను ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. దాతల సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని, మాజీ సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంచాల కిరణ్జ్యోతిప్రవీన్కుమార్, కాలనీ అసోసియేషన్ నాయకులు, మహిళలు, బీఆర్ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.