తాండూరు, నవంబర్ 10: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతున్నదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు నియోజ కవర్గంలోని ఐదుగురికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.11.25 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ సీనియర్ యువ నాయకుడు శెట్టి అమిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. ఆరు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మృతుడు అమిత్ భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. అమిత్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఇద్దరు అమ్మాయిలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ నేతలు లక్ష్మారెడ్డి, నారా మహిపాల్‌రెడ్డి, కరుణం పురుషోత్తంరావు, రవిగౌడ్, అబ్దుల్ రావుఫ్, సిద్రాల శ్రీనివాస్, పట్లోళ్ల నర్సింహులు తదితరులున్నారు.
రూ.1.50లక్షల ఎల్వోసీ అందజేత
పరిగి, నవంబర్ 10: కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలుకు కిడ్నీ సమస్యకు చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.50లక్షలకు సంబంధించిన ఎల్వోసీ కాపీని బుధవారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి లబ్ధిదారుడికి అందజేవారు. కార్యక్రమంలో పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎ.సురేందర్, బృంగి హరికృష్ణ, నాయకుడు మాలె కృష్ణగౌడ్ పాల్గొన్నారు.