Vijay Devarakonda 14 Movie Shoot Begins | ఇటీవల కింగ్డమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఆయన ప్రధాన పాత్రలో రాబోతున్న తాజా ప్రాజెక్ట్ ‘VD 14’. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో స్టార్ట్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘టాక్సీవాలా’ అనే చిత్రాన్ని రూపొందించి మంచి విజయాన్ని సాధించారు రాహుల్. ఇక ‘VD 14’ విషయానికి వస్తే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఇది 1854-78 కాలానికి చెందిన ఒక చిన్న రాజు జీవిత కథని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎంతో ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి, ఈ జంట మరోసారి కలిసి నటిస్తుండడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.