Anushka Sharma | బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మళ్లీ ట్రోలింగ్కి గురవుతుంది. కొద్ది రోజుల క్రితం బిపాషా బసుపై చేసిన వ్యాఖ్యల కారణంగా మృణాల్ ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఈ వివాదం సద్దుమణగకముందే అనుష్క శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా మరోసారి ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ ‘సుల్తాన్’ సినిమా ఆఫర్ మొదటగా తనకు వచ్చిందని.. అయితే ఆ సమయంలో తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ సినిమాను తిరస్కరించానని మృణాల్ వెల్లడించారు. అయితే సుల్తాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. అందులో నటించిన నటికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. కానీ ఆ సినిమాలో నటించిన నటి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదని.. కానీ తాను మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నానని మృణాల్ తెలిపారు. అయితే మృణాల్ ఎవరి పేరు చెప్పనప్పటికీ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలు అనుష్క శర్మను ఉద్దేశించి అని భావిస్తున్నారు. ఎందుకంటే ‘సుల్తాన్’ సినిమాలో అనుష్క శర్మ హీరోయిన్గా నటించారు. ఆ సినిమా తర్వాత అనుష్క కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం తీసుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మృణాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను తాము గొప్పగా చూపించుకోవడానికి వేరే నటిని కించపరచడం సరికాదని విమర్శిస్తున్నారు.
If this is about Anushka Sharma, it’s hilarious. Mrunal really needs a reality check working doesn’t equal winning. Anushka left the industry willingly not because she lost stardom/pull..
Honestly, Mrunal might be the meanest actress we’ve seen lately.#MrunalThakur pic.twitter.com/DaX2bzdLjz
— 𝑺𝒏𝒐𝒘𝒚-♡ (@shedreams___) September 2, 2025