Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Vigilance Raids | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
జోగులాంబ గద్వాల : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా రైస్ మిల్లుల ( Rice Mills ) పై విజిలెన్స్ అధికారుల దాడులు ( Vigilance Raids ) కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం గద్వాల జిల్లాలో దాడులు కొనసాగాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం నిల్వలు, బియ్యం అప్పగింతల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు మిల్లుల్లో ధాన్యం నిల్వలు, రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
విజిలెన్స్ దాడుల నేపథ్యంలో కొందరు మిల్లు యజమానులు అందుబాటులో లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనిఖీల్లో వెల్లడయ్యే వాస్తవాలు, ధాన్యం నిల్వల్లో తేడాలు, బాధ్యులపై తీసుకునే చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది. విజిలెన్స్ తనిఖీలతో రైస్ మిల్లుల వర్గాల్లో కలకలం నెలకొంది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే సీఎంఆర్ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

