Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Harish Rao | తెలంగాణలో కంటే ఏపీలో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. కానీ అక్కడ క్రాప్ హాలీడే లేదు.. పంటలు పండుతున్నయ్.. నీకు ఆంధ్రప్రదేశ్ కంటే వర్షాలు ఎక్కువ పడ్డా నీ చేతకాని తనం.. తెలివితక్కువ తనం వల్ల లేని కరువును ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దినవ్ నువ్వు రేవంత్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | రైతులను కానీ, ప్రజలను కానీ మీ సావు మీరు సావండి అని రేవంత్ రెడ్డి అంటుండని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఏదైనా పైసలు పెట్టి కొనొచ్చు కానీ నీళ్లు కొంటమా..? నీళ్లను కొనలేము అంటున్నడు. మరి అంత ప్రాధాన్యత కలిగిన నీళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావ్. నేను మొదటి నుంచి చెబుతున్నా.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. దానికి ఈ రూంలో ఉన్న జర్పలిస్టులే సాక్ష్యమన్నారు.
పాపం చనిపోయిన మా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోరాడిండు. దేవాదులలో నీళ్లొస్తున్నాయి.. 10 మోటార్లు నడవాల్సిన చోట మూడే మోటార్లు ఎందుకు నడుపుతున్నవ్.. ఎల్‌నినో వస్తుందంటున్నరు..3 మోటార్లు ఎందుకు నడుపతున్నవ్.. 10 మోటార్లు నడుపు.. నీళ్లు ఎత్తు. వరంగల్ జిల్లాలోని రిజర్వాయర్లు నింపు.. చెరువులు నింపు అని నేను ఇక్కడ ప్రెస్మీట్లో మాట్లాడినా.. వరంగల్ పోయి మాట్లాడినా.. మా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మాట్లాడారు. మా వరంగల్ జిల్లా నాయకులంతా మాట్లాడారు.. ఎత్తావా..? నువ్వు.. మరి ఆ రోజు నీళ్లు ఎందుకు ఎత్తలేదు.. చుక్క నీళ్లు రాగానే దేవాదులలో నీల్లు ఎత్తాలనే సోయి నీకు ఎందుకు లేదు. ఎల్‌నినో వస్తుందని ప్రపంచమంతా జాగ్రత్తపడుతుంటే నువ్వు ఎందుకు 10కి 10 మోటార్లు నడుపలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.
మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేనడుగుతున్నా.. నువ్వు 10కి 10 మోటార్లు 24 గంటలు నడిపుంటే ఇవాళ వరంగల్‌కు కరువెక్కడిది అని హరీశ్ రావు అడిగారు. కేసీఆర్ ముందు చూపుతో సమ్మక్క బ్యారేజీని కట్టి కరువు కాలంలో సంవత్సరానికి 300 రోజులు దేవాదుల నీళ్లెత్తడానికి అనుకూలంగా ఆ ప్రాజెక్టు మేం నిర్మించినం కదా..300 రోజులు ఎత్తే అవకాశముంటే.. నువ్వు నీళ్లు వదిలిపెట్టివవు.. నువ్వు వదిలిపెడితే చంద్రబాబు ఒడిసిపట్టిండు. పట్టిసీమ ద్వారా ఇవాళ ఆంధప్రదేశ్‌లో క్రాప్ హాలీడే లేదు.. కరువు లేదు.. అంతేకాదు తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఆంధ్రప్రదేశ్‌లో నమోదైంది.. తెలంగాణలో 12-13 శాతం ఉంటే.. ఏపీలో 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. కానీ అక్కడ క్రాప్ హాలీడే లేదు.. పంటలు పండుతున్నయ్.. నీకు ఆంధ్రప్రదేశ్ కంటే వర్షాలు ఎక్కువ పడ్డా నీ చేతకాని తనం.. తెలివితక్కువ తనం వల్ల లేని కరువును ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దినవ్ నువ్వు అన్నారు.
ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు?
రేవంత్ రెడ్డి రైతులు మీ సావు మీరు సావండి అని చేతులెత్తేశాడు
ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు కానీ నీళ్లు కొనలేమని రేవంత్ రెడ్డి అంటున్నాడు
మరి అలాంటి నీళ్ల విషయంలో మేము ముందు నుంచి చెప్తున్నా వినకుండా నీళ్లు ఎందుకు ఒడిసిపట్టలేదు?
నీళ్లు అన్నీ ఏపీకి తరలించి ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలా?
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2026
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

