Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లోనే ఓ డాక్టర్ మద్యం సేవించాడు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. పింప్రి-చించ్వాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యశ్వంత్‌రావు చౌహాన్ మెమోరియల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
పుణె: మహారాష్ట్రలో ఓ డాక్టర్ పోస్టుమార్టమ్ రూమ్(Post-Mortem Room)లోనే మద్యం సేవించాడు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. పింప్రి-చించ్వాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యశ్వంత్‌రావు చౌహాన్ మెమోరియల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో డాక్టర్ వైభవ్ అవినాశ్ మాస్కేను తక్షణమే సస్పెండ్ చేశారు. శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. గురవారం రాత్రి ఓ వ్యక్తి డెత్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అయితే పోస్టుమార్టమ్ రూంలో డాక్టర్ మద్యం మత్తులో ఉన్నట్లు గమనించాడు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టుమార్టమ్‌లో రూమ్‌లో ఉన్న టేబుల్‌పై ఫుడ్, బాటిళ్లు పడి ఉన్నాయి. అదనపు కమీషనర్ కుల్దీప్ జంగమ్ ఆ ఆస్పత్రి డాక్టర్‌కు నోటీసు జారీ చేవారు. రాత్రి వరకు రాతపూర్వక వివరణ ఇవ్వాలన్నారు. డాక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తూ మున్సిపల్ కమీషనర్ విజయ్ సూర్యవంశీ సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లోగా డాక్టర్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

