Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Navratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల ఘనంగా కొనసాగుతున్నాయి.
తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ( Navratri Brahmotsavams ) తిరుమల ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని( Kodanda Rama ) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణం ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగు తూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.


భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భగవద్భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు శ్రీరామునిపై అచంచలమైన భక్తికి ప్రతీక. చతుర్వేద పండితుడు, అపార పరాక్రమశాలి అయిన ఆంజనేయునిపై శ్రీ మలయప్ప స్వామివారు విహరించడం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుడి దివ్య సంబంధాన్ని ఈ వాహనసేవ స్మరింప జేస్తుంది.
ఈ వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్ కుమార్, శాంతారామ్, రంగశ్రీ, జానకీ దేవి, సదాశివమ్, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

