Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Supreme Court | పిల్లలు ఇంటర్నెట్ (Internet) ను వినియోగించకుండా పూర్తిగా నిరాకరించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు అవుతుందని స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(a) కింద ఇంటర్నెట్ను వినియోగించుకునే హక్కు ప్రాథమిక హక్కుల (Fundamental Right) తో ముడిపడి ఉందని పేర్కొన్నది.
Supreme Court : పిల్లలు ఇంటర్నెట్ (Internet) ను వినియోగించకుండా పూర్తిగా నిరాకరించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు అవుతుందని స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(a) కింద ఇంటర్నెట్ను వినియోగించుకునే హక్కు ప్రాథమిక హక్కుల (Fundamental Right) తో ముడిపడి ఉందని పేర్కొన్నది. పిల్లల భద్రత పేరుతో వారిని పూర్తిగా ఇంటర్నెట్కు దూరం చేయడం సరికాదని సూచించింది.
పిల్లల రక్షణకు, వారి స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం లేదని, రెండింటినీ కాపాడాల్సిన బాధ్యత ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వేదికలు, ఇతర ఆన్లైన్ సేవల్లో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీచేసే క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్లో భావప్రకటనా స్వేచ్ఛతోపాటు సమాచారాన్ని తెలుసుకునే, పొందే, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఇమిడి ఉందని వివరించింది.
ఇంటర్నెట్ అనేది ఆలోచనలు, సృజనాత్మకత, సమాచార మార్పిడికి వేదిక అని పేర్కొన్నది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు విద్యా సమాచారాన్ని పొందేందుకు ఇంటర్నెట్ ఒక్కటే ప్రధాన మార్గంగా ఉంటోందని తెలిపింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఇతరులతో పరిచయాలు పెంచుకోవడానికి, తమలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో అనుసంధానం కావడానికి కూడా ఆన్లైన్ వేదికలు ఉపయోగపడతాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రస్తుతం ఇంటర్నెట్ పిల్లలకు సురక్షితమైన వేదిక కాదని అంగీకరించిన కోర్టు.. ఆ కారణంతో వారిని పూర్తిగా ఇంటర్నెట్కు దూరం పెట్టడం పరిష్కారం కాదని స్పష్టంచేసింది.
అయితే పిల్లల వయసుకు తగిన భద్రతాచర్యలను కోర్టు వ్యతిరేకించలేదు. వీటి అమలుపై తగిన విధానాలను రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది. పిల్లలకు హానికరమైన అడల్ట్ కంటెంట్ వెబ్సైట్ల వంటి నిర్దిష్ట సేవలపై ఆంక్షలు విధించేందుకు తమ వ్యాఖ్యలు అడ్డంకి కాదని కోర్టు స్పష్టంచేసింది. ఇదే సమయంలో ఆన్లైన్ వేదికల్లో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు సమగ్ర జాతీయ డేటాబేస్ ఏర్పాటు సహా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

