MLC Ravinder Rao | ఈ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 30 నెలలు దాటింది. అయినా కాళేశ్వరం,మేడిగడ్డ,కన్నెపల్లి పంప్‌హౌస్‌ల గురించి ఆయనకు ఏం తెలియకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు అన్నారు.
హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అజ్ఞానం చూస్తే అందరికీ జాలేస్తున్నదన్నారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటర్లు ఎలా ఆన్ చేస్తారు..? అంటడు. ముఖ్యమంత్రికి ఏం తెలియక మాట్లాడుతున్నడని పక్కనే ఉన్న మంత్రి ఉత్తమ్ అర్ధం చేసుకొని మైక్ తీసుకొంటడు. గేట్లు మూయకుండా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని చెబుతడు. అంటే ఒక సీఎం ఇంత అజ్ఞానంతోని మాట్లాడవచ్చా? మేడిగడ్డతో పనేమిటి..? కన్నెపల్లి మోటార్లు నడపండి, రైతుల పొలాల్లో నీళ్లు పారించాలని బీఆర్ఎస్ అడిగితే తప్పా..? దానికే ఇంత దారుణంగా, అడ్డదిడ్డంగా మాట్లాడతావా..? అని రవీందర్ రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులను కోసి, ఆ రక్తం పొలాల మీద చల్లుతే పంట పండుతది అంటావా..? ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా..? రైతులకు సాగునీళ్లివ్వకుండా రక్తం భాష మాట్లాడుతావా..? మాట్లాడితే లాగుల తొండలు ఇడుస్తా.. పండబెట్టి తొక్కుతా.. పేగులు మెడలో వేసుకుంటా.. రక్తం పొలాలకు పారిస్తా.. గద్దెలు కూలుస్తా.. కనుగుడ్లు పీకి గోటీలాడుతా అంటవు.. ఆఖరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా.. ఇదేనా సీఎం మాట్లాడే భాష..? అని రవీందర్ రావు ప్రశ్నించారు.
ప్రజలకు ఏం చేస్తలేరు గనుకనే మీపై వ్యతిరేకత పెరిగింది. ఆ ఫ్రస్టేషన్ తో బూతులు మాట్లాడుతరు, అందర్నీ బెదిరిస్తరు. మీ అరాచక భాషను.. ప్రతిపక్షమే కాదు, మేధావులు, ప్రభుత్వ అధికారులు, సామాన్యులు కూడా భరిస్తున్నరు. ముఖ్యమంత్రి మాటలతో సమాజ స్వభావం మారుతున్నది. మీ రెండున్నరేండ్ల పాలనలో క్రైం రేటు పెద్దఎత్తున పెరిగింది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డులు చూసుకో, నీకే తెలుస్తది. 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగింది కాంగ్రెస్ పార్టీ. 1952 ఉద్యమంలో ఏడుగురి కాల్చి చంపించింది కాంగ్రెస్ పార్టీ.
1969 ఉద్యమంలో 369 మంది అమాయకులపై బుల్లెట్ల వర్షం కురిపించి రక్తం ఏరులై పారించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి.. ఎవరిని రా నువ్వు జైల్లో వేసేది, ఎవరిని రా నువ్వు కోసేది
తెలంగాణను కరువు ఎడారిగా మార్చి, నీ గురువుకి, ఆంధ్రా తోత్తులకి భరణం చెల్లిస్తానంటే చూస్తూ మూసుకుని ఉండము.. నీ అంతు తేలుస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు https://t.co/Bg8xOYiYpM pic.twitter.com/t0wPdKdlyl
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026